దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 1 (TEV)
తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన... తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 2 (TEV)
కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేక మైన గొఱ్ఱలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 3 (TEV)
ఇశ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచినీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతునేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడ యుధ్దమునకు వచ్చెద మని చెప్పెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 4 (TEV)
మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతోనేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 5 (TEV)
ఇశ్రాయేలురాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చినేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారుపొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించు నని చెప్పిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 6 (TEV)
అయితే యెహోషాపాతుమనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 7 (TEV)
ఇశ్రాయేలు రాజుయెహోవా యొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమా రుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతురాజు ఆలా గనవద్దనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 8 (TEV)
అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివార ములోనున్న యొకని పిలిపించిఇవ్లూ కుమారుడైన మీకా యాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 9 (TEV)
ఇశ్రా యేలు రాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవ చించుచుండిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 10 (TEV)
అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చిసిరియనులు నిర్మూల మగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 11 (TEV)
ప్రవక్తలందరును ఆ ప్రకారముగానే ప్రవచించుచుయెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 12 (TEV)
మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొనిప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు,దయచేసి నీమాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవ చింపుమనగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 13 (TEV)
మీకాయాయెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 14 (TEV)
అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచిమీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడుపోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 15 (TEV)
అప్పుడు రాజుయెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 16 (TEV)
అతడుకాపరిలేని గొఱ్ఱలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 17 (TEV)
ఇశ్రాయేలురాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెనుఇతడు కీడునేగాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని యనగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 18 (TEV)
మీకాయాయెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనముమీద ఆసీనుడైయుండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 19 (TEV)
ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరే పించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 20 (TEV)
అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడినేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవాదేనిచేతనని అతని నడిగెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 21 (TEV)
అందుకు ఆ యాత్మనేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 22 (TEV)
యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించి యున్నాడని చెప్పెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 23 (TEV)
అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏ మార్గమున పోయె ననెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 24 (TEV)
అందుకు మీకాయాదాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 25 (TEV)
అప్పుడు ఇశ్రాయేలురాజుపట్టణపు అధిపతియైన ఆమోనునొద్దకును రాజు కుమారుడైన యోవాషునొద్దకునుమీరు మీకాయాను తీసికొని పోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే యనుడి,
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 26 (TEV)
నేను సురక్షితముగా తిరిగి వచ్చువరకు వీనిని చెరలోపెట్టి క్లేషాన్నపానములు ఇయ్యుడి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 27 (TEV)
అప్పుడు మీకాయా యిట్లనెనునీవు సురక్షితముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్తజనులారా ఆల కించుడనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 28 (TEV)
అంతట ఇశ్రాయేలురాజును యూదారాజైన యెహోషాపాతును రామోత్గిలాదుమీదికి పోయిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 29 (TEV)
ఇశ్రాయేలురాజునేను మారువేషమువేసికొని యుద్ధము నకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసికొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 30 (TEV)
సిరియా రాజుమీరు ఇశ్రాయేలురాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతో నైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 31 (TEV)
కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి, గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 32 (TEV)
ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 33 (TEV)
అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇశ్రాయేలురాజును అతని కవచపు బందులసందున కొట్టగా అతడునాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులోనుండి నన్ను కొనిపొమ్మని తన సారధితో అనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 18 : 34 (TEV)
ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రా యేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చనిపోయెను.
❮
❯